అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఓ ఆర్డినెన్సుని తీసుకురాగా.. ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఆమోదం సైతం లభించింది. దీంతో ఏపీ సర్కార్ మరో అడుగు ముందుకేసి తాజాగా తీసుకొచ్చిన ఆ ఆర్డినెన్స్ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ పదవికాలం ముగిసిందని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వలు సైతం జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగింపునకు సంబంధించి మధ్యాహ్నం నుంచి తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుండగా.. ఎట్టకేలకు న్యాయశాఖ నుంచి ఒకటి, పంచాయతీరాజ్ శాఖ నుంచి సర్కార్ రెండు కాన్ఫిడెన్షియల్ జీవోలను జారీ చేసింది. రాత్రి 10.30 గంటలకు ఈ ఉత్తర్వులను సర్కార్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : 24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి


ఎన్నికల కమిషనర్ నియామకంలో మార్పులు, ప్రస్తుత కమిషనర్‌ను తొలగిస్తూ పంచాయతీ రాజ్ శాఖ నుంచి రెండు జీవోలు జారీ అయ్యాయి. పీఆర్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీ చేస్తూ న్యాయశాఖ నుంచి ఒక జీవో జారీ విడుదలైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..