24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి

ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు.

Last Updated : Apr 10, 2020, 11:57 PM IST
24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి

ఇండియాలో కరోనావైరస్ విషయంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని కేంద్రం స్పష్టంచేసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే ఒకరి నుంచి మరొకరిని దూరంగా ఉండాల్సిందిగా చెబుతూ వస్తున్నట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఏమీ లేదని లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు. భారత్‌లో కరోనా వైరస్‌పై శుక్రవారం సాయంత్రం తాజా పరిస్థితిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి దేశంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,412 చేరగా 199 మంది చనిపోయారని లవ్ అగర్వాల్ తెలిపారు. అందులోనూ గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 678 పాజిటివ్ కేసులు నమోదు కాగా 33 మంది చనిపోయారు. గురువారం దేశవ్యాప్తంగా 16002 మందికి కరోనావైరస్ పరీక్షలు చేయగా.. అందులో 0.2 శాతమే పాజిటివ్ అని తేలినట్టుగా లవ్ అగర్వాల్ వెల్లడించారు. 

Also read : Flash: కోలుకుని డిశ్చార్జ్ అయ్యాకా మళ్లీ కరోనా

హైడ్రోక్లోరోకిన్ ట్యాబ్లెట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం దేశంలో 3.28 కోట్ల హైడ్రోక్లోరోకిన్ ట్యాబ్లెట్స్ స్టాక్ ఉన్నాయని అన్నారు. భారత్ కు 1 కోటి హైడ్రోక్లోరోకిన్ ట్యాబ్లెట్ల అవసరం ఉండగా.. అంతకు మించి అధిక స్థాయిలోనే ట్యాబ్లెట్లు ఉన్నాయి కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News