AP CMRF Release : అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల బిల్లు భారీగా ఖర్చు చేసుకుంటున్న పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరం సందర్భంగా భారీ బహుమతి ఇచ్చారు. పేదలకు వరంగా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధులను భారీగా విడుదల చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా తొలి సంతకం సీఎంఆర్‌ఎఫ్‌పై చేయడం విశేషం. నిధులు విడుదల కావడంతో పేదలకు ఆర్థిక భారంగా మారిన ఆస్పత్రుల ఖర్చుల నుంచి ఉపశమనం లభించనుంది. విడుదల చేసిన నిధులతో 1,600 మంది పేదలకు ఆర్ధిక సాయం దక్కనుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 'జైలుకు పంపిన వారిపై కక్ష తీర్చుకుంటా'


నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా ముఖ్యమంత్రి సహాయ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై బుధవారం తొలి సంతకం చేశారు. ఈ నిధులతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గతేడాది అధికారం చేపట్టిన నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.100 కోట్లకు పైగా నిధులను సీఎంఆర్ఎఫ్‌కు సీఎం చంద్రబాబు పేదవర్గాలకు ఇచ్చారు. ఇప్పటవరకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 7,523 మందికి లబ్ది చేకూరడం విశేషం.


Also Read: Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి బిగ్‌ బూస్ట్‌.. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు


తాజాగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ.124.16 కోట్లకు చేరింది. తాజా నిధులతో కలిపి మొత్తం 9,123 మంది ప్రయోజనం పొందారు. పేదలు ఆర్థిక భారాన్ని మించి ఆస్పత్రుల ఖర్చులు అయితే అలాంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తోంది. వైద్యం పూర్తి చేసుకున్న అనంతరం అన్ని బిల్లులను.. ఆధార్‌ కార్డుతో జత కలిపి సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేస్తే ఈ ప్రయోజనం లభిస్తుంది. గ్రామాల్లో పేదలు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. వేల మంది దరఖాస్తు చేసుకుంటుండడంతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు సక్రమంగా అందడం లేదు. సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల విడుదలకు పెద్ద ప్రక్రియ ఉండడంతో అసలైన పేదలకు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను సత్వరమే విడుదల చేసి తమను ఆదుకోవాలని దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.