విజయవాడ: థర్మల్ పవర్ వినియోగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు థర్మల్ బ్యాటరీ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. పునరుత్పాదక వనరులను వినియోగించి బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్న తొలి కంపెనీగా ఇది రికార్డులకెక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ  ప్రైవేటు లిమిటెడ్ (బీఈఎస్‌టీ) ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది.  కాగా 2019 నుంచి కంపెనీ వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించనుంది. ప్రస్తుతం 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ కంపెనీని ..వచ్చే ఐదేళ్లలో 10 గిగావాట్ల సామర్థ్యానికి పెంచవచ్చని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఈ ఫ్యాక్టరీ వల్ల రానున్న మూడేళ్లలో 3 వేల ఉద్యోగాలను కల్పించనున్నారు. 


బోలెడు ప్రయోజనాలు !!
థర్మల్ బ్యాటరీ ప్లాంట్‌ వల్ల కర్బన్ ఉద్గారాల విడుదల తగ్గుతుంది..  సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి చరమగీతం పాడవచ్చు. దీన్నుంచి తయారైన బ్యాటరీలు టెలికమ్యూనికేషన్, వాణిజ్య అవసరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, హైవే ఛార్జింగ్ స్టేషన్లకు చక్కగా ఉపయోగపడతాయి. దీనికి తోడు విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు ఈ బ్యాటరీలతో బోలెడు ప్రయోజనాలున్నాయి