Temple Priests Power: దేవాలయాల్లో ఆచారం ప్రకారం నడవాల్సిన పూజా ప్రక్రియలు.. కార్యక్రమాలు అధికారుల తీరుతో విరుద్ధంగా జరుగుతున్నాయి. శాస్త్ర విరుద్ధంగా జరుగుతున్న తీరుతో అర్చకులతోపాటు భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో అధికారులకు కాకుండా అర్చకులకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: ప్రధాని మోదీ కలకు చంద్రబాబు మద్దతు.. జమిలి ఎన్నికలకు భారీ మద్దతు


 


దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం మంత్రివర్గంతో చర్చలు జరిపింది. అదరితో చర్చించిన అనంతరం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా దేవాలయాల్లో అధికారుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Also Read: Shock To YSRCP: డోర్లు తెరిచిన సీఎం చంద్రబాబు.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీలు


 


అర్చకులకు విస్తృతాధికారులు ఇస్తూ  జీవో 223ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. పూజలు, సేవలు, యాగాలలో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా దేవాలయాల ఆచారాల ప్రకారం విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పించడంతో ఇకపై ఆలయాల్లో శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు, సేవలు జరగనున్నాయి. పూజలు, ఇతర సేవల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వైదిక కమిటీల ద్వారా ఈవో అభిప్రాయాలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

భక్తుల హర్షం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తులు, పూజారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అధికారుల పెత్తనంతో ఆలయాల్లో సేవలు, ఉత్సవాలు వేదశాస్త్రం ప్రకారం జరగడం లేదు. శాస్త్రం పద్ధతిలో కాకుండా అధికారుల ఆదేశాలతో ఉత్సవాలు జరిగాయి. ఇకపై అలా కాకుండా శాస్త్రం పద్ధతి ప్రకారం ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి