IPS Officers: హీరోయిన్ కాదంబరి జేత్వాని బిగ్ ట్విస్ట్.. ముగ్గురు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్
Three IPS Officers Suspend In Actress Kadambari Jethwani Case: సినీ హీరోయిన్ అంశంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయకుండా వేధించారని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.
Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం రేపిన సినీ నటి కాదంబరి జెత్వాని అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎల్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆమెను తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారని.. కేసు నమోదు చేయకుండా తిరిగి పోలీసులే తనను వేధించారని కాదంబరి జైత్వానీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ అధికారుల సస్పెండ్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: YS Sharmila: ఆ విషయంలో చంద్రబాబు నోరు విప్పాలి.. ట్విటర్‌లో నిలదీసిన వైఎస్ షర్మిల
ముంబయికు చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీని మానసికంగా, శారీరకంగా వేధింపులు, ఇబ్బందులు పెట్టిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఐపీఎస్ అధికారులు కాంతి రాజా టాటా, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ వ్యవహరించారని పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
Also Read: Schools Holiday: ఏపీ విద్యార్థులకు మరో సెలవు.. వరుస సెలవులతో పిల్లలు ఎంజాయ్
ఒక మహిళ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆడపిల్లకు న్యాయం చేయాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే కేసులో ఇటీవల ఇద్దరు కింది స్థాయి అధికారులను డీజీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద తలకాయలపై వేటు పడడంతో పోలీసు వర్గాల్లో కలకలం ఏర్పడింది.
కాదంబరి జైత్వానీ అంశంలో డీజీపీ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు సస్పెండ్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని వార్తలు గుప్పుమన్నాయి. వీరితోపాటు చాలా మంది అధికారులపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయ. పోలీసుల అధికారులపై వేటుతో ఐఏఎస్ అధికారుల్లోను గుబులు ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. జగన్ హయాంలో రెచ్చిపోయిన అధికారులపై మరింత గడ్డు పరిస్థితులు ఉంటాయని తాజా పరిణామంతో తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.