Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఓ వైపు రాష్ట్రంపై ఆవహించిన ఉపరితల ఆవర్తనం మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో వారం రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో పరిస్థితి మరింత గంభీరంగా మారింది. ఈ అల్పపీడనం వాయగుండంగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఫలితంగా రానున్న వారం రోజులు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు, భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 


ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా ఎడతెరిపి లేని వర్షాలు పడనున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ ఒడిశాకు ఆనుకుని ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రబావం, నైరుతి రుతు పవనాలు బలంగా ఉండటం భారీ వర్షాలకు కారణాలని తెలుస్తోంది. ఫలితంగా ఈ నెల 29 వరకూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. నిన్న ఆదివారం రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి.  విజయనగరం జిల్లాలో అత్యదికంగా 11.3 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


విశాఖలో రెడ్ అలర్ట్


విశాఖపట్నం నగరాన్ని అతి భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ అంటే సోమవారం సాయంత్రం 5-6 గంటల మధ్య భారీ వర్షం కురవనుందని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. అల్పపీడనం ప్రభావంతో నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.  ముఖ్యంగా భీమిలి, మధురవాడ, ద్వారకానగర్, సీతమ్మధార, జగదాంబ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 


Also read: CM Jagan Mohan Reddy: రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకతంగా నిలిచిపోయే రోజు: సీఎం జగన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook