AP Rains Alert: రేపటికి వాయుగుండం, రానున్న ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. రేపటికి అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుండంతో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఫలితంగా గత రెండ్రోజుల్నించి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో గత 2-3 రోజుల్నించి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతా ముసురుపట్టి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంట్లలో అంటే రేపటికి వాయుగుండంగా మారనుంది. ఫలితంగా రానున్న ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండంగా మారిన తరువాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ వాయవ్య దిశలో కదలవచ్చు. రేపు బుధవారం కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
బుధవారం అంటే జూలై 26వ తేదీన కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక గురువారం అంటే జూలై 27న అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు కూలీలు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.
నిన్న సోమవారం విశాఖ జిల్లా ఆనందపుురంలో 96 మిల్లీమీటర్లు, పెందుర్తిలో 84, రాజమండ్రి రూరల్ లో 61.5 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్శుపేటలో 56.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా పూసలపాటిరేగలో 55.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు గోదావరి వరద పెరుగుతుండటంతో గోదావరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 9 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు దిగువ సముద్రంలోకి వదులుతున్నారు.
Also read: Schools Colleges Bandh Today: రాష్ట్రంలో నేడు స్కూల్స్, కాలేజీలు బంద్.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook