AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్బంగా హైకోర్టు పలు విషయాలపై ఆరా తీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులు, మందుల లభ్యత వంటి ఇతర అంశాలకు సంబంధించి ఏపీ హైకోర్టులో(Ap High Court) ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు, కేసుల వివరాలు, మందుల లభ్యత వంటివాటిపై హైకోర్టు ఆరా తీసింది. రాష్ట్రంలో 2 వేల 357 బ్లాక్ ఫంగస్ కేసులు, 175 మరణాలు నమోదయ్యాయని హైకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వివరించారు. ఆధార్ లేకుండానే వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఆంఫోటెరిసిన్ బి (Amphotericin B) ఇంజక్షన్ల సరఫరాలో కొరత ఉందని...వారానికి 8-10 వేలకు మించి కేంద్రం సరఫరా చేయడం లేదని హైకోర్టుకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లను అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది.


దీనికి సమాధానంగా ఇంజక్షన్ల సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న చర్యల్ని ఏఎస్ జీ వివరించారు. 11 ఫార్మా కంపెనీలకు తయారీ అనుమతులిచ్చినట్టు చెప్పారు. ఎన్ని ఇంజక్షన్లు అవసరమనేది కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం గురించి ప్రశ్నించినప్పుడు..స్థలాల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం తక్షణం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకు వాయిదా పడింది. 


Also read: Green Fungus: కొత్తగా ఇండోర్ యువకుడికి గ్రీన్ ఫంగస్, లక్షణాలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook