అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హై కోర్టు ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 60% రిజర్వేషన్‌లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర‌్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణను హై కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఏపీ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకి తొలగిపోగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల సందడికి తెరలేవనుంది.


గతేడాది ఆగస్టులోనే స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసిన సంగతి తెలిసిందే.