Ap High Court Green Signal: ఏపీలో ఉత్కంఠ తొలగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు మార్గం సుగమమైంది. ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల కమీషన్ సన్నాహాలు చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల(Ap Zilla Parishad Elections) సమరం ముగిసి అప్పుడే చాలాకాలమైంది. జిల్లా పరిషత్ ఎన్నికల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ల నేపధ్యంలో ఎన్నికల కౌంటింగ్ మాత్రం నిలిచిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడ్నించి తిరిగి నిర్వహించేలా తాజా నోటిఫికేషన్ జారీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమీషన్ దాఖలు చేసిన అప్పీలుపై ఆగస్టు 5వ తేదీన హైకోర్టు(Ap High Court)ధర్మాసనం విచారణ పూర్తి చేసి తీర్పు మాత్రం వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆ తీర్పు ఇవాళ వెలువడింది.


రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్(Ap High Court Green Signal) ఇవ్వడమే కాకుండా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని తెలిపింది. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని సమర్ధించింది.


2021 ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ, 7 వేల 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 10వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉండగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల కారణంగా కౌంటింగ్ వాయిదా పడింది. మరోవైపు ఎన్నికల్ని తిరిగి నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. మరోసారి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని..కోట్లాది రూపాయలు వృధా అవుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. హైకోర్టు కౌంటింగ్‌కు(Election Counting) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కౌంటింగ్ ప్రక్రియను ఎస్ఈసీ(SEC) ప్రారంబించింది.


Also read: Ap Degree Admissions: ఏపీలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook