AP High court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తక్షణం కోర్టు ముందు ఆ ఇద్దరు ఐఏఎస్  అధికారులను హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ హైకోర్టు (Ap high court) లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా బీసీ హాస్టల్ ఉద్యోగైన చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కరణ (Contempt of court) (పిటీషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి రామారావులను ప్రతివాదులుగా పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మార్చ్ 5వ తేదీన ఇద్దరు ఐఏఎస్ అధికారులు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఇద్దరూ విచాణకు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు (Non Bailable warrants) జారీ చేసింది. వారెంట్లను తక్షణం అమలు చేసి ఐఏఎస్ అధికారులు కే ప్రవీణ్ కుమార్, బి రామారావులను తమ ముందు హాజరుపర్చాలని విజయవాడ పోలీస్ కమీషనర్, గుంటూరు ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 19వ తేదీలోగా వారెంట్లు అమలు చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఇదే కేసులో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి కీర్తిలను కూడా ఏప్రిల్  6న హాజరుపర్చాలని ఆదేశించింది. 


Also read: YS Jagan Mohan Reddy: ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook