AP HIGH COURT: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ వికేంద్రీకరణ చట్టం రద్దు వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల(Ap Three Capitals Issue)నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ కేబినెట్ తీర్మానం అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ తరవాత చర్చ అనంతరం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లను ఆమోదించుకుంది. ఓ వైపు హైకోర్టులో మూడు రాజధానుల వ్యవహారంపై విచారణ జరుగుతుండగా..ప్రభుత్వం ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం అనూహ్య పరిణామం. ఈ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యానించింది. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ పూర్తి వివరాలు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.


మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కొంత సమయం కోరారు. శుక్రవారం వరకూ వివరాలు సమర్పించాలని కోరిన హైకోర్టు..కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం మెమో దాఖలు చేస్తే చాలదని..పూర్తి వివరాలు, మరోసారి బిల్లు తీసుకొచ్చే కారణాలతో అఫిడవిట్ దాఖలు చేయాలనే డిఫెన్స్ వాదనను పరిగణలో తీసుకుంది హైకోర్టు(Ap High Court). శుక్రవారంలోగా అఫిడవిట్‌తో పాటు మెమో, సంబంధిత బిల్లు, ఆ బిల్లును ప్రవేశపెట్టేందుకు కారణాలు, ఉద్దేశ్యాల్ని కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని వ్యాజ్యాలపై విచారణను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హైకోర్టులో వాదన సాగింది. ప్రభుత్వం న్యాయస్థానాల్ని శాసిస్తోందని ఓ పిటీషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. మూడు రాజదానుల చట్టం విషయంలో వెనక్కి వెళ్లడం లేదని..ఇది విరామం మాత్రమేనని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా హైకోర్టులో ఉదహరించారు. 


Also read: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... ఆ తేదీల్లో దర్శనం మిస్ అయినవారికి మరో ఛాన్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook