శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... ఆ తేదీల్లో దర్శనం మిస్ అయినవారికి మరో ఛాన్స్...

Tirumala Tirupati Devasthanam: భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. వారికి మరో అవకాశం కల్పించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 07:14 PM IST
  • ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయిన భక్తులకు మరో అవకాశం
    పాత దర్శనం టికెట్లతో కొత్త దర్శనం టికెట్లు పొందవచ్చు
    వచ్చే 6 నెలల్లో ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్... ఆ తేదీల్లో దర్శనం మిస్ అయినవారికి మరో ఛాన్స్...

Tirumala Tirupati Devasthanam: ఇటీవలి భారీ వర్షాలకు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు టీటీడీ (TTD) మరోసారి అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 18 నుంచి 30 తేదీల్లో శ్రీవారి దర్శనానికి టికెట్లు కలిగి.. దర్శనం చేసుకోలేని భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించనుంది. వచ్చే 6 నెలల్లో తిరిగి స్లాట్ బుక్ చేసుకునేలా టీటీడీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా భక్తులు శ్రీవారి దర్శనానికి నూతన టికెట్లను పొందవచ్చు. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం తిరుమలలో వర్ష బీభత్సం (Heavy Rains in AP) తగ్గిందని... భక్తులు నిర్భయంగా వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చునని టీటీడీ పేర్కొంది. ఇటీవల భారీ వర్షపాతం నమోదైనప్పటికీ ఒకటి, రెండు ప్రదేశాల్లో మినహా ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని తెలిపింది. తిరుమలకు (Tirumala) కాలినడకన చేరుకునే అలిపిరి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపింది. 

Also Read: ట్రక్కులోంచి కిందపడిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్నోళ్లకు ఏరుకున్నంత.. వైరల్ వీడియో

శ్రీవారి మెట్ల మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని.. భక్తులు వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ (TTD) పేర్కొంది. ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకూ ఆ మార్గంలో భక్తులను అనుమతించరని... అది మూసివేసి ఉంటుందని తెలిపింది. అన్నదానం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎటువంటి ఇబ్బందులు లేవని పేర్కొంది. భక్తులు నిస్సంకోచంగా స్వామి వారి దర్శనానికి రావొచ్చునని స్పష్టం చేసింది. కాగా,ఇటీవలి భారీ వర్షాలకు తిరుమలతో పాటు తిరుపతిలోని (Tirupati Floods) పలు వీధులు జలమయమైన సంగతి తెలిసిందే. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్ష బీభత్సంతో చాలామంది భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లలేకపోయారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News