AP High Court News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించని కారణంగా కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. రెండు వారాల జైలు శిక్షతో పాటు జరిమానాను కూడా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఐఏఎస్ అధికారులలో జికే ద్వివేది, శ్రీలక్షి, విజయ్ కుమార్, గిరిజా శంకర్, శ్యామలా రావు, బుడితి రాజశేఖర్, ఎమ్ఎమ్ నాయక్, చినవీరభద్రుడు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సదరు ఐఏఎస్ అధికారులు ఏపీ హైకోర్టును క్షమాపణలు కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జైలు శిక్షకు మినహాయింపును ఇచ్చి.. కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజున సేవ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. 


ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించింది. విద్యార్థులకు రెండు పూటల భోజన ఖర్చులతో పాటు ఒకరోజు కోర్టు ఖర్చులను భరించాలని ఏపీ హైకోర్టు పేర్కొంది. 


ఏం జరిగిందంటే?


ఇటీవలే రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వం పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాలను తొలగించాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. సంబంధిత ఐఏఎస్ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే వాటిని సదరు ఐఏఎస్ అధికారులు అమలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అమలులో నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది.  


Also Read: Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ సతీమణి?


Also Read: Srisailam Temple News: శ్రీశైలంలో అర్ధరాత్రి కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు, వాహనాలను ధ్వంసం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.