AP High Court: ఆనందయ్య ఐ డ్రాప్స్‌కు క్రిమి రహిత పరీక్షలకు ఆదేశం
AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కే రకం మందు వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..శాంపిల్స్‌ను స్టెరిలిటీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కే రకం మందు వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..శాంపిల్స్‌ను స్టెరిలిటీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఆనందయ్య కరోనా మందు (Anandaiah Corona Medicine) పంపిణీ ప్రారంభమైంది. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు హైకోర్టు అనుమతివ్వడంతో మందు పంపిణీ ప్రారంభించారు. ఆనందయ్య మందులో కే రకం (K type medicine) మందైన ఐ డ్రాప్స్‌కు ప్రభుత్వం (Ap government) అనుమతివ్వకపోయినా..హైకోర్టు అనుమతిచ్చింది. ఇప్పుడు కృష్ణపట్నం కరోనా మందుకు సంబంధించిన ఐ డ్రాప్స్‌కు క్రిమి రహిత పరీక్షలు (Sterility Test) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (Ap High Court) ఆదేశించింది. వీలైనంత త్వరగా అంటే రెండు వారాల్లోగా ఆ పరీక్ష నివేదిక ఇచ్చేటట్టు చూడాలని కోర్టు స్పష్టం చేసింది. కే రకం మందు వినియోగించదగ్గదేనని నిపుణుల కమిటీ తేల్చిన నేపధ్యంలో మందు పంపిణీ విషయంలో ఆటంకాలు సృష్టించవద్దని కోరింది.కేసు విచారణను ఈ నెల 21వ తేదీకు వాయిదా వేసింది. జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేశ్‌ల ధర్మాసనం ఈ కేసుని విచారిస్తోంది. మందు పంపిణీని అడ్డుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆనందయ్య వేసిన పిటీషన్‌తో పాటు మరో రెండు పిటీషన్లపై కొద్దిరోజులుగా విచారణ సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook