Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీడియాట్రిక్ వార్డులపై దృష్టి సారించారు.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) నుంచి కోలుకోకముందే ధర్డ్‌వేవ్ ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల చిన్నారులకు, ఏపీలోని చిత్తూరు, కడప జిల్లాల్లో చిన్నారులకు కరోనా సోకడంతో ఆందోళన పెరుగుతోంది. థర్డ్‌వేవ్ (Corona Third Wave) ప్రారంభమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం (Ap government) ముందస్తు సన్నాహాలు చేస్తోంది. థర్డ్‌వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గర్భిణీలు, చిన్నారుల కోవిడ్ చికిత్సపై వైఎస్ జగన్ దృష్టి సారించారు.యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో పీడియాట్రిక్ వార్డుల(Paediatric Ward) అభివృద్ధి, మెడికల్ కళాశాలల్లో వార్డుల అభివృద్ధికి ఆదేశించారు. వార్డుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని సూచించారు.అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. చిన్నారుల కోసం 3 కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని..విశాఖ, కృష్ణా-గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో పీడియాట్రిక్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 180 కోట్ల ఖర్చుతో ఒక్కొక్క ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
Also read: Anandaiah Medicine: ఆనందయ్య కే రకం మందు పంపిణీకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook