AP ZPTC Elections: పరిషత్ ఎన్నికలపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
AP High Court : గతంలో విడుదలైన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ నూతన ఎస్ఈసీ ముందుకు వెళ్లడం, ఎన్నికలు కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, బీజేపీ మరియు జనసేన పార్టీలు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేశాయి.
AP High Court : ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. గతంలో విడుదలైన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ నూతన ఎస్ఈసీ ముందుకు వెళ్లడం, ఎన్నికలు కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, బీజేపీ మరియు జనసేన పార్టీలు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేశాయి. దీనిపై హైకోర్టులో వాదనలు ముగియగా, తీర్పును మాత్రం హైకోర్టు రిజర్వ్ చేసింది.
పరిషత్ ఎన్నికల నిర్వహణపై సోమవారం నాడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. మరోవైపు పీలో ప్రజాస్వామ్యం కరువైందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయని, కానీ ఏపీ ఎస్ఈసీ మాత్రం చర్యలు తీసుకోకపోవడాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టీడీపీ బహిష్కరిస్తూ(Zilla parishad Elections) కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Tirupati Bypoll: తిరుపతిలో మత రాజకీయాలు చేయవద్దని హెచ్చరిక
గత ప్రభుత్వ హయాంలో 2014లో 2 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం కాగా, తాజాగా 24 శాతం ఏకగ్రీవమయ్యాయి. గతంలో 1 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవమవగా, 19 శాతం ఏకగ్రీవం అయ్యాయని చంద్రబాబు ఇటీవల పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఎన్నికల బహిష్కరించినట్లు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశం మొత్తం ఏపీవైపు చూడాలనే ఎన్నికలకు దూరంగా ఉన్నామని, పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ(YSRCP) పాల్పడ్డ హింసను చూశామని, ఇప్పుడు పరిషత్ ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తారో ఎస్ఈసీ, డీజీపీ చెప్పాలన్నారు.
Also Read: TDP Boycott Election: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook