Online Tickets:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగిలింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు అమ్మాలన్న జగన్  ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆన్ లైన్ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 69ని నిలిపివేసింది. ఈ కేసులో తుది విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అయితే ప్రభుత్వ విధానంపై దాఖలైన ప్రధాన పిటిషన్లపై ఇంకా  విచారణ పూర్తి కావాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా టికెట్ల సేల్ కు సంబంధించి ‘యువర్ స్క్రీన్స్’ పోర్టల్ ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బ్లాక్ టికెట్ దందాకు చెక్ పెట్టడం, సామాన్య ప్రేక్షకులకు అందుబాట ధరల్లో టికెట్ రేట్ ఉండేందుకే ఆన్ లైన్ ద్వారా విక్రయించాలని నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. యువర్ స్క్రీన్స్ పోర్టల్ లో సర్వీస్ చార్జ్ ను తగ్గించింది.  ఇతర పోర్టల్స్ ద్వారా ఆన్ లైన్ లో కెట్స్ బుక్ చేసుకుంటే  20 నుంచి 25 రూపాయల వరకు సర్వీస్ చార్జ్ పడుతోంది. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా సర్వీస్ చార్జీ రూ.1.95 మాత్రమే. ఆన్ లైన్ టికెట్ల విక్రయంపై సినిమా ఎగ్జిబిటర్లు, బుక్ మై షో ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది.


Read also: TS JOB Notification: రేపోమాపో టీచర్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ! భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇవిగో.. 


Read also: LPG Cylinder Price: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.