AP Inter hall Tickets 2022: ఇంటర్ మెదటి, రెండో ఏడాదికి సంబంధించిన పరీక్షా హాల్ టిక్కెట్లను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థులు సంబంధించిన కాలేజీల లాగిన్ ద్వారా అధికారిక వైబ్ సైట్ jnanabhumi.ap.gov.in నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్ నేరుగా వైబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోలేరన్న మాట. ఈ నేపథ్యంలో కళాశాలల ప్రిన్సిపాల్లందరూ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ (AP Inter hall Tickets 2022 Download) చేసి విద్యార్థులకు ఇవ్వాలని బోర్డు అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా హాల్ టికెట్ల జారీ ఏదైనా సమస్యలు తలెత్తితే తీవ్రంగా పరిగణించాలని సూచించింది. విద్యార్థులు పేర్లు, మీడియం, సబ్జెక్టుల వంటి ఇతర వివరాలను నిశితంగా పరిశీలించాలని.. అవకతవకలు జరిగితే సంబంధిత ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 23వరకు ... సెకండియర్ పరీక్షలు మే 7 నుంచి 24 వరకు జరగనున్నాయి.  ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరక పరీక్షలు జరుగుతాయి. 


Also Read: AP CPS Issue: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీపీఎస్‌పై కమిటీ


ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్
మే 6 -సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 9-  ఇంగ్లీష్ పేపర్-1
మే 11- మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
మే 13- మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మే 16- ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మే 18- కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.