AP Inter Supplementary Exams Dates: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితమే ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల వెల్లడి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ మార్కుల రీకౌంటింగ్ / రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు చివరి తేదీతో పాటు పరీక్షల తేదీలను వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఇంటర్ మార్కులు తగ్గాయి అనే భావించే విద్యార్థులు రేపు ఏప్రిల్ 27 నుంచి మే నెల 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు రేపటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని అన్నారు.


ఇది కూడా చదవండి : AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!


మే నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఇదే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు ఉంటాయని మంత్రి బొత్స చెప్పారు. ఏపీ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం కీప్ విజిటింగ్ జీ తెలుగు న్యూస్.


ఇది కూడా చదవండి : AP Inter Results 2023: గంట ఆలస్యంగా ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు.. కారణం ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK