How To Check Inter Results 2023: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. నేడు సాయంత్రం ఐదు గంటలలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. మార్చి 15న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఏప్రిల్ 4న ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 4.84 లక్షల మంది, సెకండీయర్ పరీక్షలకు 5.19 లక్షల మంది హాజరయ్యారు. ముందు నుంచి పక్కా ప్లాన్‌తో ఎక్కడా అవంఛనీయ ఘటనలు, పేపర్ లీక్ ఇష్యూ లేకుండా ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించింది. అంతేకాదు పరీక్షలు ప్రారంభమైన వెంటనే మూల్యాంకనం కూడా ప్రారంభించింది. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేస్తుండడం విశేషం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఏపీ ఇంటర్ ఫలితాలను bieap.apcfss.in, bie.ap.gov.in, results.bie.ap.gov.in వెబ్‌సైట్లతోపాటు ఇతర వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
==> మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు https://bie.ap.gov.in/, https://examresults.ap.nic.in results.bie.ap.gov.in వెబ్‌సైట్లను ఓపెన్ చేయాలి.
==> ఇక్కడ హోమ్ పేజీలో రిజల్ట్ అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
==> రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. అనంతరం మీ ఫలితాలు హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
==> ఫలితాల కాపీ ప్రింట్ తీసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
Also Read: IPL Latest Updates: కమ్‌బ్యాక్ కింగ్స్.. ఈ సీజన్‌లో రెచ్చిపోతున్న సీనియర్ ప్లేయర్లు..!
Also Read: SRH Vs DC Highlights: ఇంట్రెస్టింగ్ సీన్.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook