AP Intermediate Hall Tickets: వార్షిక పరీక్షల సమయం ముంచుకొస్తోంది. వాటిలో కీలకమైన ఇంటర్మీడియట్‌ పరీక్షలకు వేళయ్యింది. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు ఏపీ విద్యా శాఖ హాల్‌ టికెట్లను శుక్రవారం విడుదల చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను పొందుపర్చింది. ప్రథమ సంవత్సరం 5,29,457 మంది, ద్వితీయ సంవత్సరం 4,76,198 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Basara IIIT Student: బావ లేని బతుకు నాకొద్దు.. తనని కాల్చిన చోటే నన్ను కాల్చండి


డౌన్‌లోడ్‌ ఇలా..


  • ఇంటర్‌నెట్‌లో https://bieap.apcfss.in/Index.do ను తెరవగానే అక్కడ ఓపెన్‌ అయ్యే బాక్స్‌లో మొదట రోల్‌ నంబర్‌ను పొందుపర్చాలి. అనంతరం పుట్టిన తేదీ రాయాలి. మిగతా వివరాలు పొందుపర్చిన అనంతరం క్లిక్‌ చేస్తే హాల్‌ టికెట్‌ ఓపెన్‌ అవుతుంది. 

  • డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు హాల్‌ టికెట్‌లో మీ పేరు, పరీక్ష కేంద్రం వివరాలు, రోల్‌ నంబర్‌ వంటి వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించాలి.

  • అన్ని వివరాలు సక్రమంగా ఉంటే డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు.


Also Read: RX 100 Bike: గుడ్‌న్యూస్‌.. మళ్లీ రానున్న 'యమహా ఆర్‌ఎక్స్‌ 100'.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే


పరీక్షకు భారీ ఏర్పాట్లు
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. తొలి, రెండో సంవత్సర పరీక్షలు రోజు విడిచి జరుగుతాయి. ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,559 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి హాజరును ఆన్‌లైన్‌లో తీసుకోనున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్‌ కాకుండా మరింత జాగ్రత్తలు చేపట్టారు. పేపర్‌ లీకేజ్‌ కాకుండా ప్రశ్నాపత్రానికి క్యూఆర్‌ కోడ్‌ను జత చేస్తున్నారు. ప్రశ్నాపత్రం ఫొటో తీస్తే వెంటనే అధికారులకు అలర్ట్‌ వెళ్తుంది. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భద్రపరిచే పోలీస్‌స్టేషన్‌లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి