Basara Student Commits Suicide: నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈ సంఘటనతో మరోసారి కళాశాల ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది. యువతి వ్యక్తిగత కారణాలతో అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆ యువతి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ బయటపడింది. ఆ లేఖలో తన ఆత్మహత్యకు గత కారణాలను వెల్లడించింది. ఆమె రాసిన చివరి లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read: Friend Fraud: స్నేహితుడి నమ్మకద్రోహం.. ఆపదలో ఉన్నాడని సహాయం చేస్తే ప్రాణమే తీశాడు
సంగారెడ్డి జిల్లా దావూర్ మండలం దేవురాపూర్ గ్రామానికి చెందిన శిరీష (17) ఇదే ఏడాది బాసర త్రిబుల్ ఐటీలో ప్రవేశం పొందింది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఇంటి నుంచి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఇక ఎప్పటిలాగే గురువారం తోటి విద్యార్థులు అందరూ భోజనానికి వెళ్లగా శిరీష మాత్రం వసతిగృహంలోని గదిలో ఉండిపోయింది. భోజనం చేసుకుని తిరిగివచ్చిన తోటి విద్యార్థులు గదిలోకి వచ్చి చూడగా శిరీష బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో వసతిగృహంలో తీవ్ర విషాదం అలుముకుంది. వెంటనే కళాశాల అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా లభించిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో శిరీష ఎంతో వేదనతో రాసింది.
Also Read: Kurnool Court: జంట హత్య కేసులో సంచలన తీర్పు.. సంసారానికి పనికి రాని భర్తకు, మామకు ఉరిశిక్ష
'క్షమించండి అమ్మానాన్న!
నేను ఇలా చేయడం తప్పు. నాకు కూడా తెలుసు. కానీ తప్పడం లేదు. ఆకాశ్ లేని జీవితం నాకు వద్దు. వాడు లేకుండా నేను ఉండలేక ఇలా చేయాల్సి వచ్చింది. కానీ నేనేమీ తప్పు చేసి కాదు. నన్ను క్షమించండి. వాడు లేని జీవితం నాకు ఎప్పటికీ శూన్యమే. అందుకే నేను వాడి దగ్గరకు వెళ్లిపోతున్నా. కానీ వాడు అలా ఎందుకు చేశాడో నాకు తెలియాలి. అలాగే నా చివరి కోరిక కూడా ఒకటి ఉంది. నేను బావ చనిపోయినప్పుడు కనీసం చివరిసారి కూడా చూడలేదు. అందుకే నేను చనిపోయాక నన్ను కూడా బావను కాల్చిన స్థలంలోనే కాల్చండి. ప్లీస్ నాన్న నా చివరి కోరిక ఇది. కనీసం అప్పుడైనా నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మేం బతికి ఉన్నప్పుడు ఎలాగో కలిసి ఉండలేకపోయాం. కనీసం చనిపోయాకనైనా కలిసి ఉంటాం. నాకు వాడి ప్రేమ కావాలి. వాడు లేని జీవితం నాకు కూడా వద్దు. బై నాన్న. సారీ అమ్మ' అంటూ శిరీష లేఖ రాసింది.
కాగా యువతి ఆత్మహత్యకు ఆకాశ్ మరణానికి సంబంధం ఉందని తెలుస్తోంది. శిరీష మాదిరే ఆమె బావ ఆకాశ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆకాశ్ మరణం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని సమాచారం. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఆకాశ్, శిరీషల ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. నిండా 20 ఏళ్లు కూడా నిండని వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం కలచివేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి