Ambati Rambabu: ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అశ్వారావు పేట నుంచి ఖమ్మం వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మంత్రి అంబటి రాంబాబు కాన్వాయ్‌తో సహా అశ్వారావు పేట నుంచి ఖమ్మం వైపుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా విశాఖపట్నం వైపుకు గోధుమ బస్తాల లోడుతో ఉన్న లారీ వస్తోంది. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులోని హోండా షోరూం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనంలోని కర్రలు గోధము లోడుకు తగిలి తాళ్లు తెగడంతో రెండు బస్తాలు నేరుగా మంత్రి ప్రయాణిస్తున్న కారు బానెట్‌పై అంత ఎత్తు వేగంగా వచ్చి పడ్డాయి. అంతే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. డ్రైవర్ అప్రమత్తంగా లేకుంటే కారు పల్టీలు కొట్టే ప్రమాదం లేకపోలేదు. కారు బానెట్ దెబ్బతింది. ఆ తరువాత మంత్రి అంబటి రాంబాబు మరో కారులో వెళ్లిపోయారు. 


ఈ ఘటనపై సత్తుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ పరిణామాలు, భువనేశ్వరి యాత్రపై అంబటి స్పందించారు. చంద్రబాబు  అరెస్టు చట్టబద్ధమైంది, సక్రమమైందని తెలిపారు. అక్రమ అరెస్ట్ అయుండి, కక్ష సాధింపు అయితే రిమాండ్ రిజెక్ట్ అయ్యేదని అంబటి రాంబాబు చెప్పారు. అరెస్ట్ సక్రమం కాబట్టే సుప్రీంకోర్టు నుంచిపెద్ద పెద్ద న్యాయవాదులు వచ్చి వాదించినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రాధమిక ఆధారాలు ఈ కేసులో ఉన్నందునే రిమాండ్‌కు పంపించారన్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ భువనేశ్వరికి అక్రమంగా అన్పించడం సహజమని, భర్త ఎలాంటి వాడైనా భార్యకు మంచిగానే అన్పిస్తుందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. 


Also read: Chandrababu Case: బెయిల్ కోసం విశ్వ యత్నాలు, కేటరాక్ట్ ఆపరేషన్ చేయాలంటూ చంద్రబాబు బెయిల్ పిటీషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook