Ap Liquor Scam: చంద్రబాబుపై మద్యం కుంభకోణం కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిందంటున్న సీఐడీ
Ap Liquor Scam: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు.
Ap Liquor Scam: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ లభించిన చంద్రబాబుకు మరో కేసు వెంటాడుతోంది. ఆయన హయాంలో మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సీఐడీ చంద్రబాబును ఏ3గా పేర్కొంటూ విచారణకు కోర్టు అనుమతి కోరింది.
చంద్రబాబు హయాంలో మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ3గా పేర్కొంది. ఈ కేసులో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ అడ్జగోలు అనుమతులు మంజూరు చేశారని, ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగిందనేది సీఐడీ అభియోగం. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేలా నాటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 1300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ తెలిపింది. ఇందులో ఏ1గా ఐఎస్ నరేశ్, ఏ2గా కొల్లు రవీంద్ర ఉన్నారు.
ఈ ఆరోపణలపై ఐపీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం 166, 1678, 409, 120(బి) రెడ్ విత్ 34 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్ల ప్రకారం చంద్రబాబు, కొల్లు రవీంద్ర, నరేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐఎస్ నరేశ్ అప్పటి ఎక్స్చైజ్ కమీషనర్ కాగా, కొల్లు రవీంద్ర అప్పటి ఎక్స్చైజ్ శాక మంత్రిగా ఉన్నారు. ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ఈ వ్యవహారంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖ డిస్టిల్లరీ, పీఎంకే డిస్టిల్లరీలకు మేలు చేకూర్చేందుకు 2012 మద్యం పాలసీను చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని సీఐడీ తెలిపింది. 2012 నుంచి 2015 వరకూ ప్రభుత్వానికి 2,984 కోట్ల పన్నులు వస్తే..2015లో కొత్త పాలసీతో పన్నులు వసూలు కాలేదని వివరించింది. అంతేకాకుండా టర్నోవర్‌పై 8 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా 6 శాతం పన్నుల్ని తొలగించింది. ట్యాక్స్ 6-10 శాతం పెంచాలన్న త్రిసభ్య కమిటీ సూచనల్ని పట్టించుకోలేదని ఎఫ్ఐఆర్‌లో ఉంది.
Also read: Bail Conditions: బెయిల్ మంజూరు చేస్తూ చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook