AP EAPCET Schedule: ఏపీలో ఇంజనీరింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.  EAPCET పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే  EAPCET కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. వివిధ విభాగాల వారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. జూలై 4వ తేదీ నుంచి 8 వ తేదీవరకూ ఇంజనీరింగ్, బీఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. ఇక జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


తెలంగాణలో కూడా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11న ఈ పరీక్షల నోటిఫికేషన్ వెలువడనుంది. పరీక్ష విధానం, ర్యాంకింగ్‌లో ఏ విధమైన మార్పులు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీనాటికి ఫలితాలు వెలువడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ నెలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామని మంత్రి తెలిపారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల తేదీలు రెండుసార్లు మారడం వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామన్నారు. 


Also read: Paritala Sunitha: ఆ కంపెనీ నుంచి వైసీపీ ఎమ్మెల్యే రూ.15 కోట్లు డిమాండ్ చేశాడు.. పరిటాల సునీత సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook