Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ..పువ్వాడకు ఏపీ మంత్రి బొత్స పంచ్..!
Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. గోదావరి వరదల నేపథ్యంలో ఇరురాష్ట్రాల మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది.
Botsa on Puvvada: పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. విలీన గ్రామాల ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని చెప్పారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే..ఏపీని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామన్నారు.
ఏపీ ఆదాయం తగ్గింది..హైదరాబాద్‌లో కలిపేస్తారా అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే ఏపీని హైదరాబాద్‌లో కలపాలన్న డిమాండ్‌ను తీసుకొస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ రెండు రాష్ట్రాల ఏర్పాటును మంత్రి బొత్స సమర్థించారు. ఐతే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గోదావరి వరదలతో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను గతంలో ఏపీలో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిలో కొన్ని గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.
Also read:Konaseema Floods: లంక గ్రామాల్లో వరద బీభత్సం.. ఆహార పొట్లాల కోసం కొట్టుకుంటున్న ప్రజలు!
Also read:Puvvada Ajay Kumar: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించండి..మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook