AP Capital:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం కాక రేపుతోంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న కొద్ది ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అమరావతి రైతులకు పోటీగా ఉత్తరాంధ్రలో వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా.. వైసీపీ నేతలే ముందుండి నడిపిస్తున్నారనే టాక్ ఉంది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానుల విషయంలో దూకుడుగా వెళుతున్నారు. టీడీపీ, జనసేన టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాజాగా మూడు రాజధానుల విషయంలో వైసీపీ పక్కా స్కెచ్ వేసిందని తెలుస్తోంది. రాజీనామా అస్త్రం ప్రయోగించబోతుందని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖ గర్జనకు ముందు మూడు రాజధానుల విషయంలో హాట్ కామెంట్స్ చేసిన సీనియర్ నేత, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉద్యమం చేయడానికి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన మంత్రి ధర్మాన.. అన్నంత పని చేయడానికి సిద్దమయ్యారు.  మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిసైడ్ అయిన ధర్మాన.. సీఎం జగన్ కు కలిసి తన నిర్యం చెప్పారని తెలుస్తోంది. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు మంత్రి ధర్మాన. ఈ సందర్భంగా మూడు రాజధానులపై చర్చించారని సమాచారం. ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాన.. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు అందించారు.


విశాఖను పాలనా రాజధానిగా చేయడం కోసం తన రాజీనామాను ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరారు ధర్మాన ప్రసాదరావు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు తాను ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు.ఇందు కోసం రాష్ట్ర మంత్రిగా తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అయితే రాజీనామా చేస్తానన్న ధర్మానను సీఎం జగన్ వారించారని తెలుస్తోంది. మూడు ప్రాంతాలకు సమ న్యాయమే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం జగన్.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి పదవికి రాజీనామా అవసరం లేదని చెప్పారట. అయితే ప్రస్తుతానికి ధర్మాన రాజీనామాను పెండింగులో పెట్టినా.. మూడు రాజధానుల విషయంలో వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటారని.. సమయం కోసమే ధర్మానను వారించారని అంటున్నారు.


మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం ధర్మాన రాజీనామా ప్రతిపాదనపై మండిపడుతున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా ఉత్తరాంధ్రలో గొడవలకు వైసీపీ ప్లాన్ చేస్తుందని ఆరోపిస్తున్నాయి. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డంకులు స్పష్టిస్తోందని.. ఇప్పుడు రాజీనామా పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్వం చేస్తుందని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook