Chandrababu:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం గతంలో ఎప్పుడు లేనంతగా గతి తప్పాయి. అధికార, విపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలు కామన్ గా మారిపోయాయి. గతంలో రాజకీయంగా విమర్శలు చేసుకునే నేతలు హుందాగా వ్యవహరించేవారు. వ్యక్తిగతంగా వెళ్లేవారు కాదు. ఏపీలో మాత్రం ప్రస్తుతం నాయకుల నోటి నుంచి బూతులు తప్ప మంచి మాటలు రావడం లేదు. వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడమో కాదు నేతల కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగుతున్నారు. చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. సీఎం జగన్ కు అదే స్థాయిలో తమ్ముళ్లు కౌంటరిస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు కాలేజీ డేస్ లోకి వెళ్లారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అంటే దాదాపు 50 ఏళ్ల క్రితాన్ని గుర్తు చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాలేజీ చదువుకునే రోజుల్లో చేపలు అమ్ముకునే అమ్మాయిని చంద్రబాబు మోసం చేశారని మంత్రి కాకాని అన్నారు.  ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బులతో చంద్రబాబు చదువుకున్నాడని.. రాజకీయాల్లోకి వచ్చాక ఆమెను వదిలేశాడని ఆరోపించారు. తర్వాత ఎన్టీఆర్ కూతురును చంద్రబాబు పెళ్లి చేసుకున్నారని కాకాని చెప్పారు. తర్వాత మామకు కూడా వెన్నుపోటి పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూరపు నాయుడిపైనా ఘాటైన కామెంట్లు చేశారు మంత్రి కాకాని. 


చంద్రబాబు తండ్రి ఖర్జూరం నాయుడు దొంగతనాలు చేసేవాడని.. అర్ధరాత్రి వేళ పక్క వారి పొలాల్లోకి వెళ్ళి వేరుశనగ బస్తాలను ఎత్తుకెళ్లేవాడంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయాల్లోకి రాక ముందు బాబు ఆస్తి ఎంతో.. ఇప్పుడో ఎంతో చెప్పాలని ఆయన సవాల్ చేశారు.చంద్రబాబు లాంటి నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తి ఏపీలో పుట్టడమే ఈ రాష్ట్రం చేసుకున్న పాపమంటూ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కాలేజీ డేస్ లో ఒక అమ్మాయిని మోసం చేశారంటూ కాకాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే 50 ఏళ్ల క్రితం విషయాలను ఇప్పుడుచెప్పడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని సీనియర్ నేతల్లో ఒకరుగా ఉన్న చంద్రబాబుపై ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. 


Read also: Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, 24 గంటల్లో ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు 


Read also: మగతనం అంటే.. తాగి ఉన్న అమ్మాయితో కూడా మిస్‌ బిహేవ్‌ చేయకుండా ఉండటం! ఊర మాస్‌ ట్రైలర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి