Kodali Nani: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వన్‌సైడెడ్ విక్టరీ సాధించగా తెలుగుదేశం పార్టీ మరోసారి ఘోరంగా విఫలమైంది. జిల్లా పరిషత్ ఫలితాలపై మాట్లాడిన మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress party) మరోసారి విజయ దుందుభి మోగించింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారీ స్థాయిలో జడ్పీటీసీ-ఎంపీటీసీ స్థానాల్ని కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ ఫలితాలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 99 శాతం జడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీ స్థానాల్ని గెల్చుకుందని మంత్రి కొడాలి నాని(Kodali Nani) తెలిపారు. మరోవైపు చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌లపై విమర్శలు ఎక్కుపెట్టారు. మరో మూడ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబు, నిమ్మగడ్డలు వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త కమీషనర్ వచ్చాక ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తే..గెలవదనే భయంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారన్నారు. 


రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను(Ap cm ys jagan) దీవిస్తుంటే..చూడలేక ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన 8 వందల మంది టీడీపీ అభ్యర్ధులు చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టుగా చంద్రబాబు అంగీకరిస్తున్నారా అని నిలదీశారు. పప్పు, తుప్పులను నమ్ముకుంటే..టీడీపీకు తెలంగాణలో పట్టిన గతే పడుతుందని ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని..తగ్గించుకోవాలని హెచ్చరించారు. 


Also read: Elon Musk: మరో వివాదంలో ఎలాన్ మస్క్, గిగా ఫ్యాక్టరీ ఇండియాకు రానుందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook