మాజీ ఎంపీ హర్షకుమార్ ( Ex Mp Harsha kumar ) పై ఏపీ  మంత్రి విరుచుకుపడ్డారు. తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్ ( jagan ) గురించి మాట్లాడటానికి సరిపోడని వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో రాజకీయ ఆరోపణలు అధికమౌతున్నాయి.పార్టీపై విమర్శలు చేస్తున్నవారిపై వైసీపీ నేతల వార్నింగ్ ( Ycp Leaders Warning ) కొనసాగుతోంది. వైసీపీ మంత్రి పినిపే విశ్వరూప్ ( Ycp Minister Pinipe Viswaroop ) తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ కు హెచ్చరిక జారీ చేశారు. బహిరంగంగా చంద్రబాబు కాళ్లు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్ అని విశ్వరూప్ గుర్తు చేశారు. సంస్కారహీనంగా మాట్లాడవద్దని..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) దళితుల పక్షపాతి అని..తప్పు చేస్తే ఎవ్వరినీ క్షమించరని చెప్పారు. ఐదుగురు దళితుల్ని మంత్రులుగా చేసిన జగన్ పై విమర్శలు చేయడానికి హర్షకుమార్ సరిపోరని అన్నారు. రాజమండ్రిలో దళిత యువకుడి శిరోమండనం ఘటనపై తక్షణం వైఎస్ జగన్ స్పందించి చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు మంత్రి విశ్వరూప్. Also read: AP: రికార్డు స్థాయిలో కేసులు, శృతి మించుతున్న పరిస్థితి