ఏపి మంత్రి సోమిరెడ్డికి అధికారుల నుంచి చేదు అనుభవం!
ఏపి మంత్రి సోమిరెడ్డికి అధికారుల నుంచి చేదు అనుభవం!
అమరావతి: ఏపీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారుల చేతిలో మంగళవారం ఓ చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన చాంబర్‌లో నిర్వహించ తలపెట్టిన ఓ సమీక్షా సమావేశానికి అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. మంత్రి తన చాంబర్‌కి వచ్చి రెండుగంటల పాటు వేచిచూసినప్పటికీ ఫలితం లేకపోయింది. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశం ఉన్నందున తాము మీ సమీక్షా సమావేశానికి హాజరుకాలేమని అధికారులు సమాచారం చేరవేయడంతో మంత్రి సోమిరెడ్డి అక్కడి నుంచి అసహనంతో వెనుతిరిగి వెళ్లిపోయారు.
Also read : సమీక్షలు చేసుకోనివ్వండి: ఇసికి చంద్రబాబు లేఖ
ఏపీలో కరవు, తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలపై ఏప్రిల్ 30న జరగనున్న సమీక్షా సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏప్రిల్ 24నే అధికారులకు సమాచారం అందినప్పటికీ.. వారం రోజుల గడువు తర్వాత కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు మంత్రి సమావేశానికి గైర్హాజరవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో వున్న నేపథ్యంలోనే అధికారులు మంత్రి సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టి ఉంటారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.