సమీక్షలు చేసుకోనివ్వండి: ఇసికి చంద్రబాబు లేఖ

సమీక్షలు చేసుకోనివ్వండి: ఇసికి చంద్రబాబు లేఖ 

Updated: Apr 27, 2019, 01:06 PM IST
సమీక్షలు చేసుకోనివ్వండి: ఇసికి చంద్రబాబు లేఖ

అమరావతి : ఏపీలో పరిపాలనలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడంపై ఎన్నికల సంఘం అభ్యంతరాలు చెప్పడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు. ఈమేరకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన చంద్రబాబు.. ప్రభుత్వ శాఖల పనితీరు, సమీక్షలపై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పడం సరికాదని తన లేఖలో పేర్కొన్నారు. తాగు నీటి సమస్య, పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణం వంటి పనులు కీలక దశలో ఉన్న సమయంలో ఆయా అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలను ఎన్నికల సంఘం తప్పు పట్టడం సరైన పద్ధతి కాదని అభ్యంతరం తెలిపారు. 

ప్రజలచేత ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వానికి శాఖల పనితీరుపై సమీక్ష చేసే హక్కు ఉంటుందని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సమీక్షలు నిర్వహించకూడదని ఎలాంటి నిబంధనలు లేవని, ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాల విషయంలో ఆంక్షలు విధించరాదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తిచేశారు.