గుంటూరు : కరోనా మహమ్మారి సమయంలో గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు (Sri Ranganatha Raju) అన్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు గుంటూరు జీజీహెచ్‌కి గురువారం నాడు రూ. కోటి విరాళం (Sri Ranganatha Raju Rs 1 crore donation to Guntur GGH) ప్రకటించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి అయిన రంగనాథరాజు మాట్లాడుతూ.. కోవిడ్19 మహమ్మారిని ఎదుర్కోవడంలో గుంటూరు జీజీహెచ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించాం అని తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవల్ని జీజీహెచ్ ఆసుపత్రి అందిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వ్యక్తిగతంగా తాను కోటి రూపాయాలు విరాళం అందజేస్తున్నానని ప్రకటించారు. నూతన భవనం త్వరగా నిర్మాణం పూర్తి కావాలని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని కోవిడ్19 బెట్లు పేషెంట్లకు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. అవసరమైతే వైద్య సిబ్బందిని నియమించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe