ఏపీ ఆలయాలపై దాడుల వ్యవహారంలో టీీడీపీ నేతల ప్రమేయం రుజువైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డీజీపీని బెదిరించే స్థాయిలో లేఖ రాయడంపై బీజేపీ నేత సోము వీర్రాజుపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో ఆలయాలపై దాడుల రాజకీయాలు మరోసారి తెరపైకొచ్చాయి. ఆలయాలపై దాడుల కేసుల్లో టీడీపీ ( TDP ) నేతల ప్రమేయం రుజువైనందున చంద్రబాబు ( Chandrababu ) లో ఆందోళన ప్రారంభమైందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రలకు పాల్పడ్డాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ( Dgp Gowtham Sawang )‌ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోందని ఎద్దేవా చేశారు. దాడులకు సంబంధించి తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని..ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామని డీజీపీ  గౌతమ్ సవాంగ్ తెలిపారు.  


దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన రాష్ట్ర డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన డీజీపీని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Bjp president Somu veerraju ) టార్గెట్‌ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీని బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాయడం ఆయన స్థాయికి సరైంది కాదని హితవు పలికారు. నిజాలను నిగ్గుతేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 


హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) ‌కు కూడా  మంత్రి చురకలంటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తమదేనని..గుర్తు చేశారు. 


Also read: