అధికారిక చిహ్నాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెపువ్వును, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామ చిలుకను ఖరారు చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జూన్‌ నాలుగో తేదీన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది.


విభాగం పేరు
రాష్ట్ర వృక్షం వేపచెట్టు
రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు
రాష్ట్ర జంతువు కృష్ణ జింక
రాష్ట్ర పక్షి రామ చిలుక


రాష్ట్ర గీతంగా మా తెలుగు తల్లికి మల్లె పూదండ, రాష్ట్ర గుర్తుగా పూర్ణకుంభం, రాష్ట్ర భాషగా తెలుగు, రాష్ట్ర ఆటగా చెడుగుడు, రాష్ట్ర నృత్యంగా కూచిపూడి రాష్ట్ర అధికారిక గుర్తులుగా ఉన్నాయి.