Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది. అయితే, పదేళ్లు దాటిన తర్వాత కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అది పనిచేయదు. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్‌కు కేంద్రం గడువు పెంచింది.
మన దేశంలో ఆధార్ కార్డు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డు ప్రతి లావాదేవీలకు అవసరం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు.
ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ జారీ చేస్తారు. అయితే, ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయవని గడువు ఇచ్చింది. నవంబర్ 14 చివరి తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ మరికొన్ని సమస్యల కారణంగా గడువు పెంచింది.
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే మీ వద్ద రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండాలి.
అంతేకాదు రేషన్ కార్డు, ఓటర్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో ఆధార్ అప్డేట్ అయిపోతుంది.