MLA Monditoka Jagan Mohan Rao tested Covid-19 positive: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అధికార పార్టీకు చెందిన మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) నందిగామ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ( Monditoka Jagan Mohan Rao) కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండు మూడు రోజుల నుంచి నీరసంగా ఉండటంతో జగన్ మోహన్‌ రావు కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆయన సోమవారం తెలిపారు. Also read: Pulasa Fish: పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత


గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా జగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. హోం క్వారంటైన్‌లో ఉండటంతోపాటు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే జగన్ మోహన్‌రావు సూచించారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని.. ఎవరూ తనకు ఫోన్‌లు చేయవద్దని ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావు సూచించారు. అయితే ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ పలువురు మంత్రులు, అధికార పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడటంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన మరింత పెరిగింది. పదిరోజుల క్రితం వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సైతం కరోనా బారిన పడి చికిత్సపొందుతున్నారు.  Also read: Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్