Pulasa Fish: పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత

పులస చేప.. దీనిగురించి మనం ప్రత్యేకంగా చేప్పాల్సిన పని ఉండదు. ఎంత ధర పలుకుతుందో.. అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ పులస చేప కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని డిమాండ్ ఎలా ఉంటుందంటే.. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే వీరాభిమానులు ఉంటారు. 

Last Updated : Sep 21, 2020, 02:13 PM IST
Pulasa Fish: పులస చేపను 21వేలకు దక్కించుకున్న వైసీపీ నేత

Pulasa Fish in East Godavari District: అమరావతి: పులస చేప (Pulasa Fish:).. దీనిగురించి మనం ప్రత్యేకంగా చేప్పాల్సిన పని ఉండదు. ఎంత ధర పలుకుతుందో.. అంత రుచిగా కూడా ఉంటుంది. ఈ పులస చేప కేవలం ఆంధ్రపదేశ్ (Andhra Pradesh) గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. దీని డిమాండ్ ఎలా ఉంటుందంటే.. రేటు కాదు ముఖ్యం.. పులస దొరికితే చాలు అనుకునే వీరాభిమానులు ఉంటారు. ఎలాగైనా ఈ చేపను తినాలని సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఊవ్విళ్లూరుతూ మత్స్యకారుల దగ్గరకు పరుగులు పెడుతుంటారు. అందుకే పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలన్న నానుడి మనకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈ చేప వర్షాకాలంలో మాత్రమే చాలా అరుదుగా మత్స్యకారుల వలకు చిక్కుతుంది. అయితే ఈ కాలంలో ఈ చేపకోసం చాలామంది ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇంత రుచికరమైన చేప ఆదివారం తూర్పు గోదావరిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారులకు చిక్కగా.. దాని ధర 21వేలు పలికింది. Also read: Rajya Sabha Ruckus: 8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్

వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు రెండున్నర కిలోల పులస చిక్కింది. అయితే ఈ చేపను పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఏకంగా రూ.21 వేలు చెల్లించి మరి సొంతం చేసుకున్నారు. సాధారణంగా కిలో బరువున్న పులస చేప రూ.4వేల నుంచి 4,500 వరకు దొరకడం కూడా కష్టమే. ఈ క్రమంలో వైసీపీ నేత అంత డబ్బు వెచ్చించి మరి ప్రస్తుతం చర్చల్లో నిలిచారు. Also read: NTA NEET 2020 Exam Results Date Update: నీట్ 2020 ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం..

Trending News