AP New Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త కేబినెట్‌కు మరికొద్ది గంటలే మిగిలుంది. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త మంత్రుల జాబితా ఇవాళ గవర్నర్‌కు చేరనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పడనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనతో 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించేశారు. ఇక కొత్త కేబినెట్‌లో ఎవరనేది రేపు అధికారికంగా వెల్లడి కానుంది. ఈ లోగా ఎవరెవరికి అవకాశాలున్నాయనే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది. పాత మంత్రుల్లో కొందరికి అవకాశాలుండవచ్చని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి అవకాశం దక్కించుకునే పాత మంత్రులెవురు, కొత్తగా చేరేవాళ్లెవరనేది చర్చ జరుగుతోంది. ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. జిల్లా, సామాజికవర్గ సమీకరణాల ఆధారంగా లెక్కలు జోరుగా ఉంటున్నాయి.


ఈ నెల 11వ తేదీ అంటే రేపు ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరికి అవకాశమివ్వాలి, ఎవరిని కొనసాగించాలనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా కసరత్తు చేసి..అన్ని అంశాల్ని పరిగణలో తీసుకుని నిర్ణయిస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 


మరోసారి మంత్రులయ్యే అవకాశాలు వీరికే


పాత మంత్రివర్గంలో కొందరిని మరోసారి మంత్రులుగా కొనసాగించే అవకాశాలున్నాయి. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సిదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, పేర్ని నాని పేర్లు విన్పిస్తున్నాయి. ఇక కొత్తవారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేరు దాదాపుగా ఖరారైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు అవకాశాలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. 


2024 ఎన్నికలు లక్ష్యంగా కేబినెట్ మార్పులు, మాజీ సీనియర్ మంత్రులకు జిల్లా గెలుపు బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో ఎవరి సేవల్ని ఎక్కడ వినియోగించుకుంటే పార్టీకు ప్రయోజనంతో పాటు ప్రభుత్వానికి లబ్ది చేకూరుతుందనేది పూర్తిగా పరిశీలించిన తరువాతే వైఎస్ జగన్ మంత్రవర్గ కూర్పు ఉంటుందని  సమాచారం. 


Also read; AP Rains Forecast: ఏపీ ప్రజలకు కూల్‌న్యూస్, మూడ్రోజులపాటు వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook