AP New Districts: 26 కాదు 27.. ఏపీలో మరో జిల్లా విభజనకు జగన్ సర్కార్ సమాలోచన?
AP New Districts: ఏపీలో ఇప్పుడు 26 జిల్లాలతో పాటు మరో కొత్త జిల్లాను త్వరలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివాసీ ప్రాంతాలను కలిపి ఓ జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలు విభజిస్తూ ఇప్పుడు మొత్తంగా 26 జిల్లాలను ఇటీవలే జగన్ సర్కార్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మరో జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని సమాచారం. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి.
ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో జరిగిన వేడుకల్లో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో కొత్త జిల్లా ఏర్పాటుపై ఆయన మనసులోని మాటల బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడిన 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆదివాసీ ప్రాంతాలన్నింటిని కలిపి ఓ జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని పేర్ని నాని అన్నారు. దీని వల్ల పాలన మరింత సులభతరం అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీయులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లాను ప్రకటించేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్లు మంతి పేర్ని నాని చెప్పారు.
Also Read: Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!
Also Read: Lemon Price: మార్కెట్లో నిమ్మకాయలకు భారీ డిమాండ్- ఒక్క నిమ్మకాయ ధర రూ.10!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook