Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!

Pawan Kalyan on AP New Districts: ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిన క్రమంలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 02:00 PM IST
Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!

Pawan Kalyan on AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసిన జిల్లాల విభజన అని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు తోచిన విధంగా జిల్లాల విభజన జరిగిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. 

ఏపీలో కొత్త జిల్లాల విభజన లోపభూయిష్టంగా జరిగిందని.. సదరు జిల్లాల ప్రజల డిమాండ్లను కనీసం అధ్యయనం కూడా చేయలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కొత్త జిల్లాల విభజన వల్ల ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలంతా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. 

కాకినాడ జిల్లా ప్రజలకు తప్పని తిప్పలు..

గతంలో కాకినాడ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని.. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా ప్రజలకు అలాంటి ఇబ్బందలు తప్పడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మరోవైపు రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్‌ విమర్శించారు. 

రాయలసీమ ప్రాంతంలోనూ ప్రజల అభిప్రాయాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ అన్నారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రధాన డిమాండ్లు వచ్చాయని పవన్ గుర్తుచేశారు. అయితే ఈ విషయంలో ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.  

Also Read: Lemon Price: మార్కెట్లో నిమ్మకాయలకు భారీ డిమాండ్- ఒక్క నిమ్మకాయ ధర రూ.10!

Also Read: AP New Districts: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు.. సీఎం జగన్ సందేశం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News