MLC Ananthababu: హంతకుడిని గారూ అని సంబోధిస్తారా! కాకినాడ ఎస్పీపై జనాల ఫైర్..
MLC Ananthababu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కారు డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకు వెళ్లినా.. ఆ ఘటనపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణలో కాకినాడ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఎమ్మెల్సీ అరెస్ట్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఎస్పీ రవీంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఐపీఎస్ తీరుపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
MLC Ananthababu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కారు డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకు వెళ్లినా.. ఆ ఘటనపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణలో కాకినాడ పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. హత్య జరిగినట్లు ఆధారాలు కన్పిస్తున్నా.. రెండు రోజుల పాటు అనుమానాస్పద కేసుగానే ఉంచారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ అనంతబాబు.. బహిరంగంగానే తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరికి బాధితుడి బంధువులు, విపక్షాలు, దళిత సంఘాలు రోడ్డెక్కడంతో హత్య కేసుగా మార్చారు. హత్యకు పాల్పడిన అధికార పార్టీ ఎమ్మెల్సీని ఐదు రోజుల తర్వాత అరెస్ట్ చూపించారు. ఇక ఎమ్మెల్సీ అరెస్ట్ ను అధికారికంగా ప్రకటిస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. ఐపీఎస్ తీరుపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాకినాడలో మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రబాబు.. హంతకుడిగా నిర్ధారించిన ఎమ్మెల్సీ అనంతబాబును గౌరవిస్తూ మాట్లాడారు. అనంతబాబు గారు అంటూ సంబోధించారు. తన మాటల్లో అనంతబాబు పేరు చెప్పినప్పుడల్లా గారు అని ఎస్పీ మాట్లాడారు. ఎస్పీ తీరుపై జనాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చట్టం అందరికి సమానమని చెప్పే పోలీసులు.. హంతకుడిని గౌరవిస్తూ మాట్లాడటం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఎంత పదవిలో ఉన్నా కేసులో దోషిగా ఉంటే.. అందరిలానే అతనని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అందుకే కోర్టుకు తీసుకువచ్చేటప్పడు వీఐపీలను కూడా పోలీస్ వ్యాన్ లోనే తరలిస్తారు. సొంత వాహనాలను అనుమతించరు. అక్రమాస్తుల కేసులో జగన్ ను పోలీస్ వ్యాన్ లోనే కోర్టుకు తీసుకువచ్చేవారు పోలీసులు. కాని కాకినాడ ఎస్పీ మాత్రం హత్య చేసినట్లు అంగీకరించిన వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడటం ఏంటనే చర్చ అన్ని వర్గాల్లోనూ సాగుతోంది.
అనంతబాబు కేసును బలహీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి మందు తాగారని ఎస్పీ చెప్పడం ఇందుకు బలాన్నిస్తోందని అంటున్నారు. 20 వేల రూపాయల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఎమ్మెల్సీ డబ్బులు అడగగా.. డ్రైవర్ తిరగబడ్డారని కూడా ఎస్పీ చెప్పారు. ఎమ్మెల్సీ నెట్టివేయడంతో గేటుకు ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో సుబ్రహ్మణ్యం గాయపడ్డారని.. తర్వాత చనిపోయాడని ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ ప్రకటనను బట్టి.. కేసు తీవ్రతగా తగ్గించేలా పోలీసుల తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. బాధితుడు మద్యం తాగాడాని ఎస్పీ చెప్పగా.. పోస్ట్ మార్టమ్ నివేదికలో మాత్రం ఆ విషయం లేదు. పొరపాటున జరిగిన ఘటనలో కారు డ్రైవర్ చనిపోయారని పోలీసుల వెర్షన్ ఉందంటున్నారు. ఎమ్మెల్సీ చెప్పిన వివరాలే పోలీసులు చెబుతున్నారు.. కాని అసలేం జరిగిందో చెప్పడం లేదని సుబ్రహ్మణ్యం బంధువులు ఆరోపిస్తున్నారు. కాకినాడ పోలీసులపై తమకు నమ్మకం లేదంటున్నారు.
READ ALSO: MLC Ananthababu: మావోయిస్టులు హెచ్చరించినా మారలే... మన్యంలో అనంతబాబువి అన్ని అక్రమాలే..!
READ ALSO: MLC Anantha Babu: డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటీ! 20 వేల కోసం ఎమ్మెల్సీ చంపేస్తాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook