Gannavaram politics: ఏపీలో గన్నవరం రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. గన్నవరంలో చిరకాల ప్రత్యర్ధుల మధ్య పోటీ రాజకీయాల్ని మార్చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ పడిన ఇద్దరే మరోసారి పోటీ పడనున్నారు. పోటీ పడేది ఆ ఇద్దరే కానీ పార్టీలు మాత్రం వేర్వేరు. అసలేం జరుగుతోందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన యార్లగడ్ల వెంకట్రావు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ గాలి వీటినా గన్నవరం నుంచి మాత్రం టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆ తరువాత కొన్నాళ్లకే వంశీ టీడీపీ వీడి..వైసీపీలో చేరారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వైసీపీ ఎమ్మెల్యేలా మారిపోయారు. వంశీ పార్టీలో రావడంతో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్ట రామచంద్రరావులు ఆగ్రహం చెందారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని నిర్ధారణ కావడంతో పార్టీపై అలిగిన యార్గగడ్డ బయటికొచ్చేశారు. నిన్న మీడియా సమావేశంలో కూడా అదే సంగతి స్పష్టం చేశారు. చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇస్తే కలిసి గన్నవరం టికెట్ అడుగుతానని చెప్పుకొచ్చారు. అంతే చెప్పినట్టుగానే ఇవాళ హైదరాబాద్‌లో చంద్రబాబుని కలిశారు. కీలక విషయాలపై చర్చించి గన్నవరం సీటుపై హామీ పొందినట్టు సమాచారం. ఇప్పుడు గన్నవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. 


వైసీపీలో తనకు గన్నవరం సీటు రాదని నిర్ధారించుకున్న తరువాతే యార్గగడ్డ ముందే టీడీపీలోకి టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. పాదయాత్రతో వస్తున్న లోకేష్‌తో గన్నవరంలో భారీ బహిరంగ సభ సిద్ధం చేస్తున్నారు. ఈ సభలో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబుని కలిసిన యార్లగడ్డ ఈ మేరకు హామీ పొందినట్టు సమాచారం. 


అంటే ఈసారి 2024 గన్నవరం ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు జరగనున్నాయి. 2019 ఎన్నికల అభ్యర్దులే మరోసారి బరిలో నిలవనున్నారుు పోటీ పడేది ఆ ఇద్దరే కానీ పార్టీలు వేర్వేరు కానున్నాయి. గన్నవరంలో మరోసారి యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వల్లభనేని వంశీ పోటీ ఖాయం కానుంది. గతంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అయితే ఈసారి టీడీపీ వర్సెస్ వైసీపీ కానుంది.


Also read: YCP First List: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం, దసరాకే తొలి జాబితా, ఎవరెవరికి ప్రాధాన్యతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook