AP PRC Issue: చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన కొత్త అంశాలు, వ్యత్యాసమేంటి
AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణైంది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన విజయాలేంటి, కొత్త పీఆర్సీ జీవోకు, ఇప్పటికి ఏం వ్యత్యాసం వచ్చిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
AP PRC Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమణైంది. ఇరువురి మధ్య తలెత్తిన వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన విజయాలేంటి, కొత్త పీఆర్సీ జీవోకు, ఇప్పటికి ఏం వ్యత్యాసం వచ్చిందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదం నేపధ్యంలో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. విజయవాడలో మహా ధర్నా చేపట్టారు. అనంతరం ప్రభుత్వంతో మరోసారి జరిగిన చర్చలు సఫలమై..సమ్మె విరమించారు ఉద్యోగులు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు (Employees Strike) మాత్రం ప్రభుత్వంతో చర్చల్ని విభేధించాయి. చీకటి ఒప్పందమంటూ ప్రకటనలు చేశాయి. ఈ క్రమంలో మంత్రుల కమిటీ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలేంటి, జనవరి 17న విడుదల చేసిన జీవోలోని అంశాలేంటి, రెండింటికీ వ్యత్యాసమేంటనేది చూద్దాం.
ఉద్యోగ సంఘాలు చర్చలతో సాధించిన అంశాలు
రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారి 16 శాతం హెచ్ఆర్ఏ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి 24 శాతం హెచ్ఆర్ఏ వర్తించనుంది. సవరించిన కొత్త హెచ్ఆర్ఏ జనవరి 1, 2022 నుంచి అమల్లోకొస్తుంది. రిటైర్డ్ ఉద్యోగుల్లో 70-74 వయస్సువారికి 7 శాతం, 75-79 ఏళ్లుంటే 12 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ అందుతుంది. పదకొండవ వేతన సవరణ సంఘం నివేదికను జీవోలు జారీ చేసిన వెంటనే ఉద్యోగులకు అందిస్తారు. ఫిట్‌మెంట్ 23 శాతమే కొనసాగుతుంది. గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి అమలు కానుంది. 2019 జూలై 1 నుంచి 2020 మార్చ్ 31 వరకూ చెల్లించిన ఐఆర్‌ను ఉద్యోగుల్నించి రికవరీ చేయరు. 5-6 వేల కోట్ల బకాయిల్ని పదవీ విరమణ సమయానికి అందిస్తారు. ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ విధానం వర్తింపజేస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే..అంత్యక్రియల ఖర్చు 25 వేలు అందించనున్నారు. సీసీఎస్ రద్దు అంశాన్ని నిర్ధిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేందుకు అవసరమైన రోడ్‌మ్యాప్ ఖరారు కానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును 2022 జూన్ నాటికి క్రమబద్ధీకరించి స్కేల్స్ అమలు చేస్తారు.
జనవరి 17న విడుదలైన జీవోలో ఏముంది
ఫిట్‌మెంట్ 23 శాతం కాగా, ఐఆర్ 27 శాతముంది. హెచ్ఆర్ఏ శ్లాబ్ విధానం 5 లక్షల్లోపు జనాభా ఉంటే బేసిక్ శాలరీపై 8 శాతం, 5-50 లక్షల జనాభా ఉంటే బేసిక్ శాలరీపై 16 శాతం , 50 లక్షల జనాభా దాటితే 24 శాతం ఉంటుంది. సీసీఏను పూర్తిగా తొలగించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ప్రతి పదేళ్లకు పీఆర్సీ ఉంటుంది. అడిషవ్ క్వాంటం పెన్షన్ 80 ఏళ్ళపైనుంటే బేసిక్ శాలరీపై 20 శాతం, 85 ఏళ్లకుపైనుంటే 30 శాతం, 90 ఏళ్లకు పైనుంటే 40 శాతం, 100 ఏళ్లకు పైనుంటే 100 శాతం ఉంటుంది. మట్టిఖర్చులు 20 వేల రూపాయలిస్తారు.
Also read: Employees Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం, సమ్మె విరమించిన ఉపాధ్యాయ సంఘాలు..కానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook