AP PRC Issue: ఏపీ పీఆర్​సీ వివాదం నేపథ్యంలో.. మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చల్లో కాస్త పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్​ఆర్​ఏ శ్లాబుల్లో సవరణకు మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇతర డిమాండ్లపైనా మంత్రుల కమిటీని ఒప్పంచే దిశగా ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతున్నాయి.


కొత్త శ్లాబుల ప్రతిపాదనలు ఇలా..


జనాభా ప్రాతిపదికన కనీస హెచ్​ఆర్​ఏ 8 శాతం నుంచి గరిష్ఠంగా 24 శాతంగా మంత్రుల కమిటి ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.


ఇక దీనితో పాటు.. అదనపు క్వాంటమ్​ పెన్షన్​ అంశంపైనా మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. 


అయితే ప్రస్తుత ఇంకా చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇరు పక్షాలు ఈ విషయంపై ఏకతాటిపైకి వచ్చిన తర్వాత అధికారిక ప్రకకటన చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం వివాదానికి పూర్తి పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.


వివిధ ఉద్యోగ సంఘాల తరఫున 20 మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. మంత్రుల కమిటీలో.. మంత్రులు పేర్ని నాని, బోత్స సత్యనారాయణ, బుగ్గన ఉన్నారు. సీఎస్​ సమీర్​ శర్మ, జీఏడీ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్​, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం తరఫు కమిటీలో ఉన్నారు.


Also read: AP Teachers: టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... త్వరలో 30 వేల మందికి ప్రమోషన్లు


Also read: Chalo Vijayawada: ఆ జనసందోహాన్ని చూసి రాంగోపాల్ వర్మకు చలి జ్వరం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook