AP Rains Update: రోడ్లన్నీ జలమయంలో తలపిస్తున్న ఈ తరుణంలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని రోజులు కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానల వల్ల ప్రజలంతా అతలాకుతలమయ్యారు అయితే ఇప్పటికే ఏపీలో కురుస్తున్న వానలకు  మరో వాయుగుండం వేచి ఉంది. రాబోయే 24 గం.లలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఇప్పటికే విజయవాడ అంత అతలా కుతలమవుతుంది వరద నీరుతో కకావికలం అవుతున్న సందర్భంలో విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండంగా పరిగణించవచ్చు. ఈరోజు ఉదయం 8 గంటల వరకు కలింగపట్నం 280 కిలోమీటర్ల మేర దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.


ఇది రేపు అంటే సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, ఝర్ఖాంఢ్‌లో ఇది ఉధృతంగా మారనుంది. ఉత్తర దిశగా కదులుతూ ఉండటం వల్ల ఏపీకి పెను ముప్పుగా పరిగణించవచ్చు. ఇక వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ తీరం వైపు కదులుతూ బలపడి రాను 24 గంటల్లో తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఉత్తర చత్తీస్గడ్, ఝార్ఖండ్, ఒడిశా మీదుగా ప్రయాణించే పైనుంచి అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ వాయుగుండం వల్ల కోస్తాలో భారీ వర్షాలు కురువనున్నాయి. ముఖ్యంగా రెండు రోజులు అది సోమవారాల్లో ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.


Also read: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్‌..


వాయుగుండం బలపడి వాయువు దిశగా కదులుతూ పశ్చిమబెంగాల్ ఒడిశాకు సాయంత్రం నాటికి ఉధృతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదివారం నాడు ఏలూరు అల్లూరి సీతారామరాజు, తూకో. పగో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, ఏలూరు ,అల్లూరి సీతారామరాజు  ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక కృష్ణాజిల్లా, డాక్టర్‌ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది.


Also read: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?  


ఇప్పటికే వరదలో ముంపు ప్రాంతాల్లో ఉండు అతలాకుతలమవుతున్న విజయవాడ ప్రజలకు ఇది మరో గండం ఈరోజు రాత్రి వరకు ఉధృతం అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే గత రాత్రి శనివారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో సహాయక చర్యలు పుంజుకున్నాయి ఇప్పటికే విజయనగరంలో విస్తారంగా వానలు పడటం వల్ల ఇళ్లలో వర్షం నీళ్లు చేరాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.వారికి ఆహారం ఇతర అత్యవసర వస్తువులను చేకూరుస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.