AP Skill Case: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్య.లు మరింతగా పెరిగిపోతున్నాయి. క్వాష్ పిటీషన్, బెయిల్ పిటీషన్లపై ఓ వైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగానే హైకోర్టులో మరో పిటీషన్ చేరింది. చంద్రబాబు కేసును సీబీఐతో విచారణ చేయించాలనేది ఆ పిటీషన్ సారాంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ రద్దు, ఇతర కేసులపై ముందస్తు బెయిల్ అంశాలు విచారణలో ఉన్నాయి. అటు ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ విచారణలో ఉంది. మరి కొన్నికేసుల్లో పీటీ వారెంట్ కోసం సీఐడీ కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. అన్ని అంశాలు చూస్తుంటే ఈ నెల 22వ తేదీన మరోసారి రిమాండ్ విధించే అవకాశాలు సష్టంగా కన్పిస్తున్నాయి. వీటికితోడు మార్గదర్శి కేసులో చంద్రబాబు గురువు రామోజీని వెంటాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. 


స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందిని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతివాదులుగా చేర్చారు. అదే సమయంలో ఈ కేసులో హైకోర్టులో రిజిస్టర్ కూడా అయింది. 


మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ 26వ తేదీకు వాయిదా పడింది. ఇక అంగళ్లు కేసులో బెయిల్ పిటీషన్ 23వ తేదీకు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఐదురోజుల కస్టడీ కోరుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై తీర్పు పెండింగులో ఉంది. అదే సమయంలో ఏపీ హైకోర్టులో దాఖలైన క్వాష్ పిటీషన్‌పై తీర్పు కూడా రిజర్వ్‌లో ఉంది. 


వీటికి తోడు ఒకవేళ సీబీఐ దర్యాప్తుకు కోర్టు ఆదేశిస్తే చంద్రబాబుకు మరింతగా కష్టాలు పెరగవచ్చు. ఎందుకంటే స్కిల్ కేసులో మొదటగా కలగజేసుకున్నది ఈడీనే. ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ సహేతుకమని భావిస్తే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించవచ్చు.


Also read: AP Assembly Sessions 2023: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. తొడగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook