ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి తనకు ఒక విషయమైతే కచ్చితంగా అవగతమైందని..  అమిత్ షా లేఖలో రాసిన అంశాలను బట్టి.. దానికి ప్రతిగా చంద్రబాబు చెప్పిన సమాధానాలు బట్టి చూస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సూచనలు కనిపించడం లేదని అర్థమవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. కోట్లాది రూపాయలు ఇచ్చామని .. ఏపీ ప్రభుత్వమే ఖర్చు పెట్టడంలో విఫలమైందని కేంద్రం అంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం తప్ప ఇంకేమి జరగలేదని చంద్రబాబు అంటున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు నిజం తెలుసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ఓ కమిటీ వేస్తే సరిపోతుంది కదా! అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇప్పుడు ప్రత్యేక హోదా తప్ప ఇతర ఏ విషయాలు కూడా ముఖ్యమైనవి  కాదనే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిదని పవన్ తెలిపారు. తాను సైతం రాష్ట్ర విషయాలపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నానని.. త్వరలోనే ఎలా ఈ సమస్యను పరిష్కరించవచ్చనే అంశంపై కమ్యూనిస్టు పార్టీనేతలతోనూ మాట్లాడతనని పవన్ తెలిపారు. అలాగే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ సూచనలు కూడా తీసుకుంటానని పవన్ ఈ సందర్భంగా తెలిపారు.